పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ద్విపద భారతము


బురణింప ఘనరుద్రభూమియుఁ బోలె
నరుదాఁర బ్రబలభూతావాస మగుచు,
వేదప్రవర్తితవిప్రాళి పోలె
మోదమై గాయత్రిముఖ్యతఁ బొల్చి,
కనుఁగొనఁగా వర్షకాలంబుపోలె
మునుకొన్న జీమూతములఁ దేజరిల్లి,
గుఱుతైన దేవేంద్రుకొలువును బోలె
వరుస నొప్పగు వహ్నివరుణులు గలిగి,
సలలితంబైన కాసారంబు పోలెఁ
బొలుపైనయట్టి యంబుజములు గలిగి
విలసిల్లుచున్న యవ్విపినమధ్యమున
లలి నొప్పుచుండు నలంబతీర్థంబు.
అచ్చోట రోహణంబను వటభూజ
మచ్చరువై విహాయసమెల్లఁ గప్పి
తేజరిల్లుచు వైనతేయునిఁ జూచి :
యోజగన్నుతశీల, యొనర నాయందు
శతయోజనంబుల శాఖలుగలవు.
జతనమై యుండి కచ్ఛపమును గజము
నాహారముగఁ గొని యరుగుము; నీకు
నూహింప నిదిగాని యొండిమ్ములేదు."
అనవుండు పక్షీంద్రు 'డౌఁగాక!' యనుచుఁ
దనపాదయుగళంబు తరుశాఖ నూఁద,
ఫెళ ఫెళధ్వనులఁ బెంపెక్కి యొక్కింత
నిలువక విలయాభ్రనిర్ఘోషఘోష
ములఁ గొమ్మవిఱుగ, నప్పుడు ఖగేంద్రుండు
నెలవుగాఁ దరుశాఖ నిలిచి తపంబు
నతినిష్ఠఁ జేయుచు ననశనస్థితులు

వ్రతములుగానున్న వాలఖిల్యాది