పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

77


నలువారఁ బదియోజనంబులువిరివి,
పొలుపార యోజనంబులుమూఁటిపొడవు
ధరియించి, తొంటిక్రోధంబునఁ జేసి
సరిఁ గలహింతు రచ్చలముతో; నిపుడు
నారెండు నాహారమగు; నట కేఁగ
నారయ జయసిద్ధియగు నీకుఁ బుత్ర!"
యనవుడుఁ బ్రణమిల్లి, యచ్చటి కేఁగి,
కనియె నాగరుఁడండు గజకచ్ఛపముల;
గగనంబు నీలమేఘంబు నొక్కటనె
తెగి కలహించు నత్తెఱఁగున నుభయ
వనములలోని జీవంబులు బెగడఁ
గనలుచు నొండొంటిఁ గదిసి తాఁకియును,
దొక్కియుఁ, గఱచియు, దోఁగ నీడ్చియును,
నొక్కట నిగిడియు, నొరసియు, నిట్లు
వెక్కసంబుగఁ బోర వీక్షించి, వాని

గరుడఁడు గజకచ్ఛపములతోఁ గశ్యపునొద్ద కేఁగుట


ఱెక్కల నడఁచి, యారెంటిని గాళ్లఁ
బెనచి, నభోవీథి బిట్టు లంఘించి
చనుచోట గాంచ భీషణగహనంబు;
తనరు కైలాసభూధరమునుబోలె
ననుపమలీల శివాన్వితం బగుచు,
రమణ ధనదునిమందిరంబును బోలె
నమలిన కాంచనాయతపూర్ణ మగుచు,
దండిమై మునిజనస్థానంబుఁ బోలె
శాండిల్య కౌశిక సంయుక్త మగుచు,
జలజమిత్రుని దినచక్రంబు పోలె
విలసిల్లు రాజర్క[1]విన్యాసమగుచుఁ,

  1. విశ్వాస (మూ )