పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ద్విపద భారతము


నిడుమలఁ గుడిచి, యే నిట నిన్ను గాంచి,
యుడుకాఱి వగదప్పి యుండితిఁ; బిదప
నిను బాసి యేరీతి నిలువంగనేర్తు!"
ననవుడు తల్లితో ననియె మోదమున :
"నమరలోకం బెంత! యస్వప్ను లెంత
యమృతంబు సాధించు టది యెంత నాకు!
నీకేల మదిలోన నేఁ డింతచింత!
గైకొని యమృత మీక్షణమునఁ దెత్తు."
ననవుడు ప్రియమంది, యప్పు డావినత
గొనకొని యాత్మలోపలఁ బతిఁ దలఁచి,
తనయునితనువు హస్తంబున నిమిరి,
తనరారువేల్పులఁ దలఁచి యిట్లనియె:
"అనిలుండు నీ ఱెక్కల, నలుండు శిరము,
తనువు సూర్యుఁడు, వీఁపు తారకావిభుఁడు
కాతురు; వేల్పులు కరుణతో నిన్ను
బ్రోతురు ; విజయంబు పొందు నీ వనఘ!”
అనుచు దీవించినయమ్మకు మ్రొక్కి :
"జనని, యే నమృతంబు సాధించునపుడు
ఘనజవసత్వంబు గలుగంగవలయుఁ;
గనుఁగొన క్షుత్తుచేఁ గాదు కార్యంబు;
ఆహార మేది పద్మాక్షి, నా!” కనిన :
"సాహసబలుఁడ, నీచనుత్రోవ జలధి
లోఁ గిరాతాలి వాలుచునుండు ; వారు
లోఁగక జనుల నుశ్లోకుల నెపుడు
కారించి, యేపుచుఁ, గడువ్రొవ్వి, గణన
మీఱి, దుర్వారు లమేయప్రతాపు
లగ్లలమై యుందు; రల కిరాతులను

భగ్గించి, యందఱి భక్షింపు; మప్పు (?)