పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

73


డందు విప్రుండు నీకనశనం బగును;
ఎందు నీకును జయం బెసగు ఖగేంద్ర!"
నచ్చట విప్రుఁ డని యెఱుంగుటకు
వినిపింపు గుఱుతైనవిధము,' నావుడును :
“పక్షీశ, బోయల భక్షించునపుడు
కుక్షిలోనికిఁ బోక, కుత్తుకయందుఁ
జిక్కుగాలము క్రియఁ, [1] జిచ్చునుబోలె
మిక్కిలిమండుచు మెఱయుచునుండు."
అని బ్రాహ్మణునిగుఱుతంతయుఁ జెప్ప,
విని ముదమంది యవ్విహగవల్లభుఁడు
వినయంబుతోఁ దల్లి వీడ్కొని, ధరణి
ననువొంద నిలిచి, యాయతపక్షయుగము
కొండొక యల్లార్చి, కుప్పించి, యమర
మండలియును మర్త్యమండలి పొగడ,
దిగిభముల్ చెదర, భీతిలి శేషుఁ డదర,
జగములన్ని వణంక, శైలముల్ బెణఁక ,
జవమున నెగసి నక్షత్రమార్గమున
బవనవేగమున నిర్భరగతిఁ బఱచి,
వారిధిలోన నెవ్వారి కభేద్య
శూరులై వాలి యస్తోకశౌర్యమున
మత్తులై త్రిదివసమాజంబునైన
నొత్తిగెల్వఁగఁజాలు నురుశక్తిగలుగు
శబరవే[2]షుల గాంచి, చటులవేగమునఁ
బ్రబల[3]గుహానిభవక్త్రంబుఁ దెఱచి,
బలువిడిఁ బెక్కండ్రఁ బట్టి యొండొండ
తలఁగక మ్రింగ, నత్తఱి గళబిలము

  1. చిక్కున
  2. వేషము
  3. మహాభవక్త్రం బటు (మూ)