పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

71


ఘనపరాక్రమము వేగంబును గలిగి
వినుతిఁ బెంపొందిన విహగముఖ్యుఁడవు;
దాస్యంబుఁ బాపుకోదలఁచెద వేని
హాస్యంబు పొందక యమృతంబు మాకుఁ
దెచ్చియి." మ్మనవుడుఁ దెచ్చెదననుచు
నచ్చుగా మైకొని, యట దల్లికడకుఁ
జనుదెంచి తత్ప్రయోజన మెఱిఁగించి:

అమృతాహరణము



'చనితెత్తు నమృత మీక్షణమున.'ననినఁ,
దనయుఁ గౌఁగిటఁ జేర్చి తగ నాదరించి,
తనరార నొండొకతడవు వీక్షించి :
కలఁగక యట్టి దుర్ఘటమైనపనికి
దడయక మైకొని తనయ, వచ్చితివి.
అమరులసాధింప నలవియె మనకు!
నమృతంబు సాధింప నలవియె నీకు!
నెలమి నేఁ బెక్కువేలేఁడులు తపము
నలయకచేయఁ, బుణ్యానుకూలమున
గలిగిన నాదైనగర్భంబునందుఁ
బొలుపార రెండండములు పుట్టుటయును,
దవిలినపుత్త్రవత్సలత నందొకటి
యవియింప నేరమి నయ్యండమునను
గొడుకొక్కరుఁడు [1]పిచ్చుకుంటయి పుట్టి,
పెడఁబాసి చనియెఁ గోపించి శపించి,
దానిచే సుమ్మి యీదాస్యంబు నాకు

జానొప్పఁ దలఁగక సంభవించుటయు,
  1. పిచ్చగుంటయై పుట్టి (మూ),