పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


నేకంటఁ జూచితి! విం దేది నలుపు!
[1] నాకంటె నీకంటెనా! కంటిఁదెలివి'!
అని పక్షిమాత నన్నాడినఁ జూచి,
వినతతో 'గల' దంటి, వినత 'లే' దనియె.
నంత: “నేఁజూపెద; నటు చూపకున్నఁ
బంతమాడెద; నీకు బానిస నగుదు;
చూపుము మఱి నీదు చుట్టఱికంబు
 [2]ఱేపు; వెన్ దీయకు; వ్రేయుము కరము'
అని పన్నిదము వేసి, యట పోయిపోయి,
దినపతి క్రుంకుచోఁ దిరిగి వచ్చితిమి.
అగునెల్లి జయమైన నపకీర్తియైన;
నగుఁబాటు మాన్పరే నను గటాక్షించి!
చని హయవాల మచ్చట నల్పు చేసి
చనుదెండు మీరు; వంచన చేయరేని
వినతకు దాసినై విహరింపవలయు;
నెనయ నాకోర్కుల నీడేర్పరయ్య!"
అని వేఁడుకొనుటయు, [3]నాయకార్యంబు
నొనరింప నేరక యొఱగొడ్డెమాడి,
తమకించి చూపులఁ దమవక్రగతులఁ
దమరోషవిషములఁ దఱచుగాఁ జూపి,
వెనుకొని యందఱు వెఱఁగంది : 'యిట్టి
పని యధర్మస్థితి భావించి చూడ ;
జామరొ, యిటు సేయఁజనునె యెవ్వరికిఁ!
గ్రమ మొప్ప నెచట 'ధర్మమె జయం' బనుచుఁ
బలుకువేదంబు లేర్పడ మున్ను వినవె !

వలవదు తల్లి ! నీవాక్యంబు నేము
  1. నాకంటనీకంట నాకంట దెలివి
  2. వ్రేపు నేదేనియు వ్రేయుము కరము
  3. నభ్యూర్జశక్తి (మూ)