పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ప్రథమాశ్వాసము


కద్రూకృత కపటప్రయత్నము



అప్పుడు కద్రువ యాత్మసంభవులఁ
దప్పక పిలిచి యందఱితోడఁ బలికె:
తనయులు గల్గుట తల్లిదండ్రులకు
మును దారొనర్చినపుణ్యఫలంబు
లగు; నైనఁ, దత్పుత్త్రు లతిబలశౌర్య
సుగుణగాంభీర్యవిస్ఫురణ రంజిల్లి
పితృమాతృభక్తిచేఁ బెంపొందిరేని,
సుతులని కొనియాడఁ జొప్పడు; గాన,
వినుఁడు నే మిమువేఁడువిధము సర్వంబు
ఘనులు మీరందఱుఁ గడముట్ట నిపుడు,
నాతనూభవులార, నాగేంద్రులార,
మీతల్లి నేను నమ్మితి మిమ్ము నొకటి ;
సకలరూపంబులఁ జరియింప నేర్తు;
రొకచోట నల్లనైయుండరే పోయి!
అమరులు నసురులు నంభోధిఁ ద్రచ్చి,
యమితనిర్మలమైన హయముఁ బుట్టించి,
దాని నయ్యంభోధితటినుంచి పోవ,
నేనును, వినతయు, నిట ప్రొద్దుపోక
సవతిపొత్తునఁ గూడి చరియింపుచుండి,
రవిక్రుంకువేళ వారాశితీరమున
నట్టిశ్వేతాశ్వంబు నల్లంతఁ జూచి,
యిట్టంటి వినతతో నే విచారించి :
అల్ల తెల్లని జవనాశ్వంబుతోక
[1]నల్లనై యుండెఁగా! నవుఁగా లతాంగి!
యేఁ గంటి'; ననిన, 'నిహీ' యని నవ్వి:

'రాఁగదె పోదము రమణి, యచ్చటికి;
  1. నల్లనై యున్నది నవుగా లతాంగి (మూ )