పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

53


అతులితోజ్జ్వలశిలాహతులఁ జంపియును,
ధృతి శూలశక్తులఁ దొడరఁ గూల్చియును,
బ్రాసఘాతములచేఁ బ్రాణముల్ గొనియు,
నీసునఁ గుంతాల నెదిరిమోఁదియును,
భిండివాలములచే బీరుమాన్పియును,
దండితోమరముల ధరణిఁ గూల్చియును,
అదటులో నుభయసైన్యంబులవారు
గదనంబు మిగులభీకరముగాఁ జేయ,
నప్పుడు బలము ధైర్యంబు జవంబు
తప్పక పొదవిన దనుజయూధంబు
లరవాయిగొనక యా యమరయూధంబుల
దఱమిన, వార లెంతయు బలం బెడలి,
కష్ట[1])దుష్టావస్థ గడుభీతిఁ బొంది
యష్టదిక్కులకును నటు పాఱిపోవఁ ,
బరవశంబున మీఱి పాఱెడుసేన
వెఱవకుండని భేరి వేయించి, కడఁక
బురుహూత శిఖి యమ పుణ్యజనేశ
వరుణ మారుత ధనేశ్వర వృషధ్వజులు
చలముతోఁ గరి మేష సైరిభ మనుజ
జలచర మృగ హయోక్షములపై నెక్కి,
తనరంగ బలశక్తి దండ కౌక్షేయ
ఘనపాశ కేతు ముద్గర కుఠారములు
ధరియించి, దనుజయూధంబుపైఁ గదిసి
దురమున నొప్పంగఁ, దూలి దానవుల
బారెల్ల నెదురనిల్వఁగలేక భీతిఁ
బాఱంగ, నిజసైన్యపటలి నీకించి
బల భీమ శతమాయు బాష్పల నముచి

నల కాలకేయ కంధరు లుగ్రు లగుచు
  1. దురావస్థ (మూ