పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ద్విపద భారతము


సురాసురసమరము


ననుచుఁ గోపాటోప మందంద పొలయ,
ఘనబాహుశౌర్యహంగారంబు లడర,
రథరథ్యసుభటవారణముఖ్యచటుల
పృథు[1]లపదాహతిఁ బృథివి గంపింపఁ,
బణవభేరీదివ్యపటహాదివాద్య
రణనచే నాశాంతరంబులు వ్రయ్యఁ,
జండ[2]నిశాతభీషణహేతిచయము
మండుచు భానుబింబముఁ గప్పి పాఱ,
దారుణసింహనాదములచే నభము
బూరటిల్లగ, రయంబునఁ గిట్టి కినిసి,
శర శూల తోమర శక్తి కౌక్షేయ
పరశు గదాంకుశ ప్రాసార ముసల
భిండివాలముల నాభీలసంరంభ
చండాంశు లగుచు నిర్జరులఁ దాకుటయు,
వారును గడఁగి దుర్వారప్రతాప
సారులై పోరాడుసమయంబునందుఁ
గుదియక శరముల గుదులుగ్రుచ్చియును,
మదమున గదలచే మడియమోఁదియును,
జిదియంగ గజములచేతఁ ద్రొక్కించి
బెదరిపాఱఁగఁ గడుబిట్టదల్చియును,
గడలచే గ్రుచ్చి యాకసమున కెత్తి
నడుములు దునియంగ నఱికివైచియును,
బిడికిటిపోట్లను [3]బిమ్మిటి గొలిపి
తడబడ ముసలఘాతముల నొంచియును,
అంకుశంబుల గుండె లగలఁదీసియును,
డొంకెనపోటుల డొల్లదీసియును,

  1. రావనాహవ
  2. నిశాటఘోషణ
  3. బిమ్మట (మూ )