పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

ద్విపద భారతము


నురవడి ననిసేయుచున్న దిక్పతులు
యరదంబు లెదురుగా నడరి తోలించి,
పఱచుసేనలఁ గూడఁబఱచి, [1]ధైర్యంబు
మెఱయఁ గొండలఁగప్పుమేఘంబులట్లు
లలితోగ్రదృఢముష్టిలాఘవలక్ష్య
బలశౌర్యములు మీఱ బాణజాలములఁ
గప్పి, స్రుక్కించి, యఖండశౌర్యమ్ము
లుప్పతిల్లఁగ నింగి యుదరఁ బెల్లార్చి,
యంతటఁ బోవక యమరవల్లభుని
దంతితోఁగూడ మదంబు దక్కించి,
యనలుఁ బొట్టేటితో నదరంటఁ దోలి,
యెనుబోతుతో యమునేఁపు దూలించి,
నరునితో నిరృతిమానము తూలపుచ్చి,
వరుణు నక్రంబులో వడిఁబాఱఁదోలి,
పపమాను నిఱ్ఱితోఁ బట్టి భంగించి,
తవిలి యశ్వమ్ముతో ధనదునిఁ బఱపి,
యెద్దుతో నీశాను నేపడఁగించి,
యద్దెసఁ జిక్కిన యమరులఁ జదుప
గర్వితులైన రాక్షసులతో ననికి
నోర్వక వెసఁ బాఱుచున్నయావేళ
నమరులఁజూచి, దయాగుణోల్లాస
మమర 'నోడకుఁ' డని యభయంబు లిచ్చి,
చక్రంబు నురుదివ్యశరచాపములను
విక్రమంబునఁ బూని, విమతులు చెదర,
నతి[2]కుపితాత్ములై యసురవర్గంబు
[3] సంహార మొనరింప, సకలరాక్షసులు
విహ్వలులై పాఱి విషధిలోఁబడిరి.

  1. సైన్యంబు
  2. కుటిలాత్ములై (మూ).
  3. "నరనారాయణులు" అను కర్తృపదము అథ్యాహారము.