పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

73


“ పడఁతి నీయొడలు దప్పక చూడ వెఱుతుఁ
దొడిబడిఁ గనుఁబాటు దొరయునో యనుచు.
కలకంఠి నీయున్న గరువంబుఁ జూచి
పలుకఁ జూచిన నోరు పలుక నోడెడిని.
నలినాక్షి, యిటమీఁద నన్ను పేక్షింపఁ
దలఁచితివేనియు దర్పకుం డేచి
మోహనాస్త్రము వేసి మోహరించుటయు
దేహంబు నాకు సందేహంబు గాదె?
అప్పుడు బ్రతికింప నలవియే నన్ను?
ఇప్పుడే కరుణింపు మిభరాజగమన.."
అనవుడుఁ గలుషించి హరిణాయతాక్షి
తనికినకోప మంతయు డిందుపఱచి
“ వేగంబు గొనఁ గాదు, వీనిఁ బొం దైన
లాగున విఱుతు నేలా మాట" లనుచు
నొప్పార నిట్లనె "నో యన్న నీకు
నిప్పుడు నారూప మెట్లు తీ పయ్యె
ఈచీర లీయొడ లీయున్న యునికి
కీచకాగ్రజ నీకుఁ గింకిరి గాదె!
ఇర వొప్పు గన్నుల కింపు గాదేని
పురుషుని కాకాంతఁ బొంద నేమిటికి?