పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ద్విపద భారతము



బంగారు ప్రతిమతోఁ బ్రతి యైననీకు,
అంగన, పేరేమి? యధిపుపే రేమి?
నీతండ్రి యెవ్వఁడు ? నీకులం బెద్ది ?
ఏతఱి వచ్చి తీవెఱిఁగింపు ” మనిన,
ఆసరోరుహగంధి యతనిమాటలకు
రోసి నెమ్మదిఁ బాసి రుష నూర కున్న
గినిసి యంతటఁ బోక కీచకాగ్రజుఁడు
వనితఁ దప్పక చూచి వల నొప్పఁ బలికె:
"కను విచ్చి నావంకఁ గడగంట నైనఁ
గనుఁగొన్నఁ ద ప్పౌనె కర్పూరగంధి ?
మెఱుఁగారుమోమున మేలు రెట్టింపఁ
జిఱునవ్వు నగ రాద చిగురాకుబోణి ?
అలరార వీనుల కమృతంబు లొలుక,
బలుకంగ రాదొకో పంకేరుహాక్షి!
నీలీల లిట్లు వర్ణించునామాట
లాలింపఁ దగదొకొ యలినీలవేణి "
అనుచుఁ జేరఁగఁ బోవు, నమ్ముగ్ధమాట
వినఁ గోరు, మఱియును వినఁ గోరు; నచటఁ
దనరార నెన్ని చందములఁ బాంచాలి
మనసు గానక వాఁడు మఱియు ని ట్లనియె :