పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

ద్విపద భారతము


ఆఁడుబిడ్డలతోడ నర్థితోఁ బుట్టి
నేఁడు న న్ని ట్లాడ నీకు న్యాయంబె  :
హీనవంశముదాన నేఁ బతివ్రతను;
కానక నీ విట్లు కాఱు లాడుదు వె? 1
అని వీడఁ బలికిన నాసింహబలుడు
మనసిజుఁ డలయింప మఱియు నిట్లనియె :
"హీనవంశమునందు, నీచక్కఁదనము
లే నెఱుంగక యుండ వెచ్చోటఁ గలదు?
కలువఱేకులయందుఁ గల మెత్తఁదనము
చెలియ నీకరములఁ జేరి యున్నదియ.
చెలువారునంబక శ్రీలు చెల్వొందు
చెలి మారునంబక శ్రీలు నా దనరి .
తొలకరిమెఱపులుఁ దొలఁకాడురుచుల
నెలఁత యొక్కట నేలె నీదేహకాంతి.
గండుతుమ్మెదచాయఁ గసుగంద కుండ
నిండారి యున్నవి నీదు పెన్నెఱులు
పదియాఱుకళలఁ దప్పనిచందమామ
సుదతి నీవదనంబుఁ జూచి లజ్జించు.
ఇట్టిశృంగారంబు లెల్ల భాగ్యములు
పుట్టింప కుండునే, బొంకంగ నేల?