పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

ద్విపద భారతము


ముదితనెమ్మోము సోముని గెల్వ నేర్చి
నది గాన నలరారు నధరామృతంబు.
జగతి నింద్రుని కిట్టిసతి లేదు గాక
తగ వేది మునికాంతఁ దగులునే యతఁడు?
తొమ్మండ్రు బ్రహ్మలు తొడరిరో కాక
యిమ్ముగ్ధ నొకబ్రహ్మ యెట్లు సృజించు !
ఈయింతిఁ జూచిన నీశానుతపము
పాయదే మరుఁడు తప్పఁగఁ జేసెఁ గాక !
హనుమంతుఁ డీయింతి నలవోకఁ గన్నఁ
దనబ్రహ్మచర్యంబు తడపెట్ట కున్నె?
కమ్మపువ్వును మ్రింగుగండుతుమ్మెదలు
కొమ్మకొప్పును బోలి కొమరొప్ప కున్నె !
భామినినడు మురో భారంబు దాల్ప
ధీమంతుఁ డజుడు మంత్రించెఁ గాఁ బోలు!
మొదలఁ బద్మిని గాన ముదిత కిం పారె
బదపద్మముఖపద్మపాణిపద్మములు.
సీమంతరేఖయుఁ జెక్కుటద్దములు
రోమరాజీయు దంతరుచులు నెన్నడుము
బోటికి నొప్పు; చూపులు విలాసములు
మాటలనేర్పులు మందహాసములు......