పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

67


తనయక్క యైనభూతలనాధుసతికి
వినతి సేయఁగ వచ్చి వెస నిల్లు సొచ్చి
యద్దేవిగద్దియ కనతిదూరమునఁ
దద్దయు ద్రుపద నందన యున్నఁ జూచి
కలలోనఁ బెన్నిధిఁ గని పేదవాఁడు
పలుమాఱు నూహించుపగిది నాసించి
మనసిజువలఁ జిక్కి మానంబు దక్కి
తనలోన నిట్లని తలపోయఁ దొడఁ గె:
“అచ్చెరు వీపంకజాక్షి రూపంబు
మెచ్చొందెఁ దొలుకారుమెఱుఁగును బోలి!
అడుగులకెంజూయ యాననద్యుతులుఁ
దొడల క్రొమ్మెఱుఁగులుఁ దోరంపుఁబిఱుఁదు
సన్నంపునడుమును సౌ రొందువళులుఁ
జెన్నారులతలు నాఁ జెలఁగు బాహువులు
మెఱుఁ గారు మోమును మీననేత్రములు
నెఱివెండ్రుకలకప్పు నెగడె నింతికిని.
కరుగునఁ బోసెనో కంజజుం డతను
శరము లైదును గూడ జలజాక్షి గాఁగ!
హరుఁ డేమి సేయు నియ్యబల నీక్షించి ?
విరహాగ్నిఁ గాముఁడే విరిసెఁ గా నోపు!