పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

69


ఎల్లమాటలు నేల? ఈ కాంతఁ గన్న
తల్లిదండ్రులు సేయుతప మొప్పెఁ గాక.
ఓయారమునఁ జేరి యుగ్మలి మారు
సాయకంబులఁ జిక్కుసరణి గీల్కొలిపి
యాలోలసౌఖ్యాబ్ధి నల్లాడఁ దలతు.
ఏలాగు చేయునో యించువిల్తుండు  !
జలజలోచనఁ దెచ్చి సంధించుపనికి
గలఁడొకో నాకు నిక్కడ నొక్కతోడు ? "
అని పెక్కుభంగుల నాసింహబలుఁడు
మనసిజునకు లోఁగి మదిరాక్షి బొగడు.
మగువఁ బైకొన జూచు మానంబుఁ దలఁచు.
తగిలి వెంటను జూచు, ధైర్యంబు విడుచు,
కనువ్రాల్చు, తల యూఁచు, గలఁగు, నచ్చోట
జనులచప్పుడు చూచి చాల శంకించు.
అలవి మాలినకోర్కు, లతిశయిల్లఁగను
గలయఁ గోరుచు నుండుఁ గామాతురుండు
తలయుఁ జీరయు మాసి తనుఁ దానె రోసి
మెలఁగుపాంచాలిఁ గామించి కీచకుఁడు.
ఆకాంతభీతియు నాకాంత వణఁకుఁ
జేకొని మదిఁ గామ చేష్టగాఁ దలఁచి