పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౨.

59

నవరసంబులతోడ నలు వొప్పఁ గథలు
వివిధశాస్త్రంబులు వేడ్కఁ జెప్పుచును,
పరితోష మగువేళఁ బసిఁడిపాచికల
దొరకొని భూపాలుతో జూద మాడి
తనరారువేడుక ధనము లార్జించి
మునుకొన్న వేడ్కఁ దమ్ముల కెల్ల నిచ్చు.
వలలుండు తఱచుగా వసుధేశునకును
వలయుమాంసంబులు వండి యిచ్చుచును
మిగిలెడుమాంస మమ్మెడివానిఁ బోలె
మొగి నిచ్చు. నన్న దమ్ములకు నిత్యంబు.
నరుఁడు నాట్యముఁ జూపి నరనాధుచేత
వరరత్న భూషణానళి మెచ్చు వడసి
మహితుఁ డై చేర్చి ధర్మజభీమనకుల
సహదేవులకు నిచ్చు సారెసారెకును.
నకులుండు నరనాధునకు నొక్క వేళఁ
బ్రకటించి ఘోటక ప్రకరంబుఁ జూపి
వెలలేనితొడవులు విభుచేతఁ బడసి
నలు వొప్ప నిచ్చు నన్నలకుఁ దమ్మునికి.
ఆసహ దేవుండు నవనీశునెదుట
గోసహస్రంబులు కొమ రొప్పఁ జూపి