పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౨.

శ్రీరాజితాకార, శివభక్తిపూర,
గౌరవాకార, జంగలముమ్మధీర.
వినుము వెండియు నిట్లు వివరింపఁ దొడఁగె
జనమేజయునకు వైశంపాయనుండుః
ఆరీతిఁ బాండవు లబలతోఁ గూడి
వారక విరటభూవరుని సేవించి
తమతమనడచువర్తనము లేమఱక
సముచితు లై దుష్టజనులసోఁ కోర్చి
యడఁకువ ప్రియము నెయ్యమును మోమోట
మెడపక పనులందు నే వగ్గలించి
తమరాక జనులకుఁ దలపోఁత లైన
భ్రమయించి చొప్పు మార్పడ మాట లాడి
తగుకార్యములు గాగఁ దమలోనఁ దాము
తగిలి భాషించుట తఱచుగా మాని
యుండుచో ధర్మజుం డొక్కొక్కమాటు
నిండారువేడుక నృపునికొల్వునను