పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

ద్విపదభారతము.

కూడఁ బెట్టినవస్త్రకుండలాదికముఁ
దోడఁబుట్టువులకుఁ దోడ్తోడ నిచ్చు.
పన్నుగాఁ బాంచాలి ప్రాణవల్లభులఁ
గన్నారఁ జూచి శోకము పుట్ట మరలి
మాట పుట్టక యుండ మనుజేంద్రునగర
మాటిమాటికి వారిమనసు రా మెలఁగు.
ఈచందమునఁ బ్రేమ లిచ్చఁ బాటించి
రాచకర్జంబులరచన లేమఱక
పనులవెంబడి డాసి పరు లెఱుంగనటు
పొనరఁ గైకొన్నరూపుల నటింపుదురు.
చెలఁగి తేజంబు దాఁచినవారు గాని
నులభు లై జనులకుఁ జూడంగ వచ్చి
మొదలఁ జిచ్చఱఁగన్ను మోడ్చినయట్టి
మదనారిముఖములమాడ్కి భాసిలిరి

విరటుసభకు నొకానొక మల్లుఁడు వచ్చుట.


అత్తఱి నొకజెట్టి యసమానబలుఁడు
మత్తేభగమనంబు మా నైనయురము,
జేవురించినమేను, చిఱుతకూఁకటియు,
కావిదిండును, పెద్దకటములమోము,