పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


ధర్మజుమాఱుగాఁ దలఁచి నీవద్ద .
నిర్మలమతి నుండ నియతి వచ్చితిని.
వేయు నేటికి, నశ్వవిద్యయం దేను
పోయినదే వీధి పొలుపార వినుము.
అవయవలక్ష్మణం, బాయుఃప్రమాణ,
మవిరళ గర్భంబు, లాయింగితములు,
వయసుకట్టడలును, వడి దేశకాల
నియతి నాహారంబు, నిద్ర వచ్చుటలు,
జాతికిఁ దగినశిక్షలు చెప్పి యణఁచు
రీతులు, భయమదోద్రేకచిహ్నములు,
మాత్రాంతరంబులు మఱియుఁ బె క్కైన
చిత్రంబులను నేర్తు ; సేవింతు నిన్ను,
అంచితంబుగ నీకు నవసరం బైన
జించి చెండాడుదుఁ జెలఁగి శాత్రవుల,"
అనవుడు భూపాలుఁ "డది యేల? నీకు
నను వైనకొలు విచ్చి యాదరించెను.
కడువేడ్కఁ జావిడిఁ గర్త వై యుండు
మెడపక " యన్న మహీపతి కనియె:
"నీవు మన్నించుట, నీవు ర మ్మనుట,
నీ వాదరించుట, నే నెఱుంగుదును,