పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

41



దండలానకమును దగు ప్రెక్కణంబుఁ
గుండలియును నెఱుంగుదుఁ బేరణంబు
నటన నాయిరువది నాల్గుహస్తములు
బటువు చూపఁగ నేర్తుఁ బ్రతి తాళమునకు.
కేలఁ దాళంబులఁ గీలింప కొడల
నాలోలగతి గీత మభినయింపుదును.
తనరఁ బాదంబులఁ దాళ నిర్ణయము
గనుపట్ట భావంబుఁ గాన్పింప నేర్తు,
భావాశ్రయంబులు పరికింప నేర్తు.
భావించి న న్నేలు భరతవిద్యలకు. "
అనపుడు నృపచంద్రుఁ డమరేంద్రసుతునిఁ
గనుఁగొని తనకోర్కి కాన రాఁ బలికె :
"ని న్నిట్లు పేడిగా నిర్మించె బ్రహ్మ !
సన్నుతింపఁగ నీవు సౌభాగ్యనిధివి ;
ఘనములౌ భుజములుఁ గఠినకాయంబు
దిననాధు తేజంబు దీర్ఘనేత్రములు
నీకు నొప్పినయవి ; నీవు నాయొద్దఁ
జేణిని వర్తింపఁ జింతించెదేని,
ఒనర నావిండ్లలో నొకమంచివిల్లు
ఘనవజ్రకవచంబు ఖడ్గాయుధములు