పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

ద్విపద భారతము


వలయుభూషణములు వారువంబులును
వెలయ నిచ్చెద నుండు విభవంబు మెఱసి.
నిన్ను మాభూమికి నృపునిఁగాఁ జేయ
నున్నచో నిట్లాడ నుచితమే నీకు ?"
అనవుడు విభున కి ట్లనియె నర్జునుఁడు
తనరూపరేఖకుఁ దగుసిగ్గు దోఁప:
"అడుచందము తిర మై యుండు నాకు,
పోఁడిమిగా లేదు పురుష భావంబు ;
ఈనపుంసకవృత్తి యేమిశాపమునఁ
బూని యేతెంచెనో ! పొందుగా మిగుల
నడఁకువతో నుండు టది యొప్పుఁ గాని
తొడుగుచు మెఱవడి తోనుండ రాదు.
పాంచాలియింట నే వసియించినపుడు
మించినయారూపు మెఱసినఁ జాలు.
అచ్చోటఁ బాత్రల ననువుగా దిద్ది
మెచ్చులు పడయుదు మెఱవడితోను.
వీను మాటయొజ్జ నై విహరింతు నిచట ,
ఘనముగాఁ బిలిపింపు కన్యకాజనము."
అనవుడు మనుజేంద్రుఁ డాదరం బొప్పఁ
దనపుత్రి యైనయుత్తరఁ బిల్వఁ బనిచె.