పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

ద్విపద భారతము


ఓయారమున జంగ లొఱపుగా నిడుచుఁ
బాయక కరిరాజుబాగుఁ గైకొనిన, :
కొలువువారల కెల్లఁ గువలయాధిపుఁడు
సొలయక నరువంకఁ జూపి యిట్లనియె."
"పొలఁతిసింగారంబుఁ బురుష, భావంబుఁ
గలిగి యున్నది దీనిఁ గంటిరే మీరు ?
తేజంబుపొడపును దృష్టింప నరుఁడు,
రాజసంబును జూడ రమణి కా నోపు,
ఈడు జోడును లేక యెవ్వఁ డే నొకఁడు .
వేడుకఁ గైకొన్న వేషంబు గాక,
ఇంతవానికి నేల యీవికారంబు
పంత మాడినయట్లు ప్రాపించె నకట !
చెప్పుడు మీకుఁ దోఁ చినజాడ " యనినఁ
జెప్ప నేరక వారు చింతించు నెడను,
భూపాలు దగ్గఱఁ బోయి జిష్ణుండు
తీ పారుమాటలఁ దెలియ నిట్లనియె:
“నిన్ను వేడుకఁ గొల్చి నృపచంద్ర యేను
గన్నయలకు నాటఁ గఱప వచ్చితిని.
ఇల బృహన్నలనామ మింపారు నాకు;
మొలచె దైవాధీనమునఁ బేడితనము. .