పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ద్విపద భారతము


బన్ను గాఁ దనవిల్లు పార్థుండు చూచి
కన్నుల బాష్పంబు గ్రమ్మ ని ట్లనియె :
“ఇది సాధనంబుగా నెల్ల రాక్షసులఁ
ద్రిద శేంద్ర వైరులఁ దివిరి సాధించి
యనిమొన గర్వాంధు లైనశాత్రువుల
జను లెల్లఁ గొనియాడ సంహరించితిని.
కడపట నొకమ్రానఁ గట్టి యీవిల్లు
విడువంగ వలసె, దైవిక మేమి చెప్ప !"
అని యెక్కు డించుచు నాధర్మ సుతుని
ధనువుఁ దప్పక చూచి తలఁకి వెండియును
"ధర్మజ, యీవిల్లు ధరియించి నీవు
దుర్మార్గులను నెల్లఁ ద్రుంచి వైచితివి.
భారతరాజ్యంబు భయము లే కుండ
నారసి యీవింట నాజ్ఞ పెట్టితివి.
దనుజు లెయ్యది గన్నఁ దల్లడిల్లుదురు,
ధను విట్టిదియు నీకు దాఁచంగ వలసె !"
అనుచోట ధర్మ జుం డది యెక్కు డించి
వెనుకొని భీముని వీక్షించి పలికె:
"సైంధవయక్షపాంచాల సైన్యముల
సంధించి బకవైరి చంపి తీవింట,