పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

359

పంచాక్షరీమంత్రపర సుతత్త్వజ్ఞ
పంచమ వేదప్రపంచనిర్వహణ
జనదోషహరణశిష్టప్రతిపాల
ఘనభుజాటోప మార్కండేయనిత్య
ప్రథితజంబూద్వీపభారధౌ రేయ
పృథులసౌభాగ్యగంభీరసముద్ర
అని యిట్లు నృపతికి నభివృద్ధి గాఁగ
నెనసినవేడ్కతో నేఁ జెప్పినట్టి
యీపుణ్యకథ విన్న నెలమి వ్రాసినను
రూపించి చదివినరుచిరపుణ్యులకు
నరుదారఁ బుత్రపౌత్త్రాభివృద్ధియును
ఇహలోకపరలోకహిత మైనసుఖము
మహి తాయురారోగ్యమంగళచయము
రమణ బట్టేపాటి రామలింగంబు
క్రమము దప్పక యిచ్చుఁ గలకాల మెల్ల,
ఆవేల్పు గొల్చినయనఘాత్ము పేర
సరణిగాఁ బంటవంశప్రభు పేర
మరియు జంగాలముమ్మయధీరు పేర
సహజసజ్జను పేర సంప్రోక్త మైన
మహితకావ్యము ధాత్రి మను లెంతకాల