పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

ద్విపద భారతము.

యనఘుఁ డై విప్రుల నధికదానములఁ
దనిపెఁ బాయసపూపతతులతోఁ గూడ.
వివరింప నప్పుడు విరటుమందిరము
కవిలోక గోష్ఠీ వికాసంబువలనఁ
జటులగీతంబుల సరసవాద్యముల
నటనటీజనఘననాట్యసంగతుల
యాదవపాంచాలు రాధిగాఁ గల్గు
మేదినీవిభులసమ్మేళంబువలన
లలి మీఱ దంపతులకు నివాళికలు
నలు వొప్ప నిచ్చుపుణ్య స్త్రీలవలనఁ
బ్రాకటశుభ వేషభరితు లై వెలుఁగు
రాకొమారుల హాస్యరసములవలనఁ
గులపౌరుషము లెత్తి కుంభినీశ్వరులఁ
గలయఁ గీర్తించుమాగధ పంక్తివలనఁ
బొనర మిన్నులు దాఁకుభూరిదక్షిణలఁ
దనిసినభూ దేవతాకోటివలనఁ
జతురవిలాసినీచక్రంబువలన
నతిమనోహర మయ్యె నని చెప్పుటయును
జూల సంతోషించి జనమేజయుండు
మే లైనపూజుల మెప్పించె నతని.