పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

355

అంతఁ గ్రమ్మఱి వచ్చి యభిమన్యుచూడ్కు
లింతిబంగరుమేన నిర వొంది యలర
నాపొలంతుకచూపు లభిమన్యుమోముఁ
బ్రాపించి నిలువ నేరక సంచలించె.
అలఁతివేడ్కయు సిగ్గు నా వేళఁ గలసి
తలఁపులు వెలిఁ బాఱఁ దడఁబాటు సూపఁ
బతిచూపు మఱి ద్రిప్పు భామచూ పలర
నతిచూపులను ద్రిప్పు సౌభద్రుచూపు.
అంతట మునులుఁ బుణ్యాంగన ల్విప్రు
లెంతయు దీవింప నెలమిఁ గృష్ణుండు
ధర్మజాదుల వేడ్క దగిలి కీర్తింపఁ
బేర్మి సౌభద్రుండు పృథులహర్షమునఁ
గలకంఠికంఠభాగమునఁ గీలించెఁ
గళల నిం పొందుమంగళసూత్ర మెలమి.
తదనంతరంబ యిద్దఱుఁ దంత్ర మరసి
ముద మొప్ప దోసిళ్ల ముత్యము ల్నించి
యొగిఁదీఁగయునుమ్రానునొండొంటిమీఁదఁ
దగిలి యొయ్యన విరు ల్దమి రాల్చుకరణి
చెలువారఁ నొండొరు ల్శిరసులమీఁదఁ
దలబ్రాలు నించి రెంతయు సిగ్గు దోఁప.