పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

ద్విపద భారతము.

నాసుభద్రాసుతు నర్థిఁ దోడ్కొనుచు
వాసి మీఱఁగ వైభవంబు దళ్కొ త్తఁ
గర మొప్పునుత్తరాంగనకు మా టున్న
తెరయొద్ద నిలిపినఁ దెర యొప్పెఁ జూడఁ
దొలఁగక దివసరాత్రులవెంట నడుమ
నిలిచినలేఁత వెన్నెలచాలు పోలె
దిన నాథవిక చప ద్మినులమధ్యమునఁ
గనుపట్టునుదయరాగచ్ఛాయ పోలె.
అవేళ దైవజ్ఞు లఖిల దేవతల
భావించి కీర్తించి పరమమోదమున
రమణీయశుభ తూర్యరవము రంజిల్ల
సుముఖు లై దీవించి సుమహూర్త మనుచుఁ
దెరచీరఁ దిగిచిన దేవేంద్రుమనుమఁ
డరవిందముఖివక్త్ర మభిలాషఁ జూచె.
ఆచూపు లను తేఁటు లామోద మంది
యేచినమాధుర్య మింపారఁ గ్రోలి
మగుడ నేరనిమాడ్కి మరగు చున్నంత
మగువయుఁ దనచూడ్కి మగనిపాదముల
నిలిపినఁ గస్తూరినీట నచ్చోటఁ
దొలికినచంద, మె తోఁచెఁ జూపఱకు.