పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

353

నుత్తుంగ గజములు నుత్తమాశ్వములుఁ
గ్రొత్తగాఁ గై సేసి కొన్నింటిఁ గొనుచు
లెక్కకు మిగులు పల్లెకు లందు నిండి
చొక్క పుమణులు భాసురవ స్త్ర చయము
కలవస్తువులు దివ్యగంథముల్ మఱియుఁ
బొలు పైనతొడవులుఁ బుష్పమాలికలు
మధురభక్ష్యంబులు మఱియుఁ బె క్కైన
విధములక్రంతలు వింతగా నడువఁ
దగురీతి బ్రాహ్మణోత్తములదీ వెనలు
మగువలపాటలు మాగధస్తుతులు
తరచుగా వినుచు ముందర శౌరి నడువఁ
దిర మొప్ప విరటుమందిరముఁ దాఁ గదిసి
భాసిల్లి యెదురుగాఁ బఱ తెంచి సతులు
సేసలు చల్లుచోఁ జెలఁగి కైకొనుచుఁ
జటులఘంటాముఖసకల నాదముల
బటు వైనవిరటభూపతియిల్లు చొచ్చె

ఉత్తరాభిమన్యులవివాహ మహాత్సవము.


అతఁడు భీతియు సిగ్గు హర్షంబు దోఁప
వితతవైదికతంత్ర విభవంబు నడప