పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

ద్విపదభారతము

తలపోయ నిది నీకు ధర్మమే?” యనిన
వెలయ నించుక నవ్వి విజయుఁ డిట్లనియె

పాండవులు విరాటునకుఁ ద మ్మెఱింగించుకొనుట.


"ఇంక నెక్కడికంకుఁ డితఁడు ధర్మజుఁడు
బొం కాడ నేరనిపుణ్యుఁ డీరాజు .
అవని నీతఁడు గాచు నవనీశు లితని
యవసరంబులు చూతు రతిభ క్తితోడ;
ధరణి నీతఁడు ప్రోచు ధరణీధరములు
పరఁగంగ నీతనిపగవారి మోఁచు.
లలిఁ జక్రవాళశైలములలో నుండి
యిల నిండుశశిఁ బోలు నీరాజుకీర్తి.
రాజులధన మెల్ల రాజసూయమునఁ
బూజలు గొని యిచ్చెఁ బొసఁగ విప్రులకు.
ఇతనికై రగిగాఁపు లెల్లభూవిభులు;
ఇతనిబాహాశక్తి కెదురు లే దెందు.
ఇతఁ డుండఁ జెల్లు నయ్యింద్రాసనంబు
ధృతి నిట్టికుఱుచగద్దియ కైనఁ దగఁడె?”
అనుటయు విని విస్మయమును సంశయము
దనుఁ జుట్టుకొనఁగ భూతలనాథుఁ డంత