పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

331

ధవళవస్త్రంబులు ధవళగంధములు
ధవళమాల్యంబులు తగురీతిఁ దాల్చి
యేడుదీవులు నేలునృపులరీతిగను
జూడ నొ ప్పెడుభాతి సుభగవేషమున
ధరణీశునగరి నాస్థానంబుఁ జేరి
పరఁగంగఁ బసిఁడికంబములమధ్యమున
నలు వొప్ప సింహాసనముఁ జూచి యందుఁ
దలకొని కూర్చుండె ధర్మనందనుఁడు ;
తమ్ములు నతనిపాదములు సేవించి
నెమ్ము నుండిరి రత్ననిచితపీఠముల.
ఆలోన విరటుఁ డింపారఁ గై సేసి
యోలి మంత్రులుఁ దాను నుత్తరుఁ గూడి
బోరున నాస్థానభూమి కే తెంచి
యారూఢగతిఁ బాండవాగ్రజుఁ జూచి
"ఇది యేమి వివరింపుమా కంకుభట్ట;
మదిలోన గర్వించి మమ్ముఁ గైకొనక
తగ వేది మాతోడ దట్టించి పలికి
జగడించితివి నిన్న సౌజన్య మేది
నెఱయ నంతటఁ బోక నేఁ డన్న నిట్లు
మెఱసి నాగద్దియమీఁ దెక్కి తిపుడు !