పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

ద్విపదభారతము

బోయెద" నని ధర్మపుత్త్రుఁ జూచుటయు
నాయుత్తముఁడు వారి సపుదు వారించి
"అక్కట మీర లిట్లన నేల ? మనల
నిక్కపురూపులు నృపుఁ డేమి యెఱుఁగు?
ఎఱిఁగింత మెఱిఁగియు నిట్టివాఁ డైనఁ
దఱువాత నిట్టిది తలపోయఁ దగును.
వానిరాజ్యంబున వసియించి మనము
నా నాసుఖంబులు నడపు చుండితిమి.
కడపట నొకతప్పు గాంచిన నేమి ?
ఉడుగుఁ డాగ్రహ" మన్న నుడిగి రందఱును.
ఎలమిఁ బాండవు లిట్లు హితభాషణములఁ
దలకొన్న వేడ్క నెంతయుఁ బ్రొద్దు పుచ్చి
"యెల్లి వత్తము గాక యీ రాజసభకుఁ
దొల్లిటిరూపులతో" నంచుఁ బలికి

పాండవులు విరాటునికొలువుగద్దియల నలంకరించుట.



యారాత్రిఁ బుచ్చి పూర్వాద్రిపై నినుఁడు
తేరు ద్రిప్పకమున్నె తీర్థంబు లాడి
కాలోచితము లైనకర్మంబు లెల్ల
నాలోచితధ్యాను లై నిర్వహించి