పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

ద్విపదభారతము.

హితగతి నుత్తరు నిటఁ దెత్తు కాని
యతనిఁ దోడ్కొని రాకు" మని చెప్పియనిపె.
నృపతియు "నిది యేమి యేకాంత" మనక
విపులహర్షావేశవివశుఁ డై యుండె.
అత్తఱిఁ బణిహారి యాక్రీడి నిలిపి
యుత్తరుఁ దోడ్తెచ్చె నుర్వీశుకడకు.

ఉత్తరుఁడు తండ్రియొద్దకు వచ్చుట.


అతఁడును సాష్టాంగ మపుడు గావింప
సుతుని రాఁ దిగిచి భాసురలీల నృపుఁడు
గౌఁగిటఁ జేర్చి గద్గదకంఠుఁ డగుచు
మూఁగినవేడ్క మోమున ముద్దు వెట్టి
కన్నీటఁ దోఁగి యాకస మొప్పఁజూచి
వె న్నప్పళించి దీవించుచో నతఁడు
నొక్కింతభీతితో నొగి ధర్మజునకు
మ్రొక్కుచు నతనిమోమున గంటిఁ జూచి
"ఇది యేమి?" యనిన ధాత్రీశుఁ డిట్లనియె
"నది నీకుఁ జెప్పెద నర్థితో వినుము:
నేటియుద్ధంబున నీగెల్పు గాఁగ
మాట లాడఁగఁ దాను మాటిమాటికిని