పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-౫

319


నినుఁ బోలుశూరుండు నెగడునే యిలను!”
అనిపల్క నుత్తరుం డనువారం బలికె:
" కినిసి కౌరవులను గెల్చి వచ్చుటయు
మన పాఁడికుఱ్ఱలు మగిడి వచ్చుటయు
నాకును నీబృహన్నలు గల్గఁబట్టి
చేకూరెఁ గాని నాజీవాల మెంత?
ఒనర సారధు లుర్వి నున్నారు గాని
తనరారు బలిమి నీతనిసాటి యెఱుఁగ,
నని సూతనుతి దోఁప నర్జునుఁ బొగడి
ఘన మైనరాజమార్గముఁ జొచ్చి వచ్చి
పతిమందిరముఁ జేరఁ బణిహరి నృపున
కతఁడు వచ్చుట యెల్ల నధిపుతోఁ జెప్ప
రాజును "రధిక సారథుల నిచ్చటికి
రాజిల్లి తోడ్కొని రమ్ము పొ"మ్మనిన
నరిగెడిపణిహారి నా ధర్మసూనుఁ
డరుదారఁ బిలిచి యొయ్యన వానితోడ
"నీయొల్కు నెత్తురు నిల్చునందాఁక
నాయున్నయెడ బృహన్నల రాఁగ వలదు.
పరికింప నను భక్తిఁ బాటించుఁ గాన
విరటుఁ గోపించు నావ్రేటు చూచినను.