పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-౫

321

దనపేడి గెల్చె నుత్తరుఁడు గాఁ డనినఁ
గనలి నెత్తపుసారె గాఁడ నేసితిని.
ఇది స్వయంకృతదోష మీమౌని" కనిన
మదిలోన భీతుఁ డై మనుజేంద్రసుతుఁడు
"తగునయ్య కోపింపఁ ? దప్పు చేసితిరి;
మగుడ నాడుదురయ్య మాన్యులే మనిన?
ఆడుట గాక నో నడచినా రతని!
పాడి దప్పినవారిఁ బాయదే లక్ష్మి?
కావున వీరి నిక్కడనె ప్రార్థింపుఁ
డే వెంటఁ బొగులరా దీపుణ్యుమనసు.
కారణపురుషులు గారె వీ?" రనిన
ధారుణీనాథుండు తల్లడిల్లుచును
గంకుఁ బ్రార్థించినఁ గంకుఁ డి ట్లనియె:
"శంకింప నేటికి జననాథతనయ
నాకు గోపము లేదు; నరనాధుఁ డైన
నేకిల్బిషియుఁ గాఁడు హితకారిగాని.
పొడమె నూరక వాదు ప్రొద్దు కీ డనఁగ
జడియ నేల?" యటంచు శాంతంబు దోఁప
మనుజేంద్రునకుఁ దాను మంచివాఁ డగుట
ఘనత నుత్తరునకుఁ గాన్పించునంత