పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము---ఆ -5

297

తారును దమయంతం దగిలి పాఱుటయు
వారక నరు డంత వారి వె న్దగిలి
వివిధసాయకముల వేధించి తోలి
రవిసూను విడతల రయ మొప్ప నేసె;
దివిజులు కొనియాడ దివ్య శంఖంబు
రవళి చేసినం జూచి రవితనూభవుండు
దుర్యోధనుని బ్రోవ గురునేనలోనిదొగలం
గర్ణుండు పిలంచుటు,
కలశ సంభవ పోకు; గాంగేయ తిరుగు;
భల భేదిసూనుండు పతిమీద వచ్చె.
నిలువు మశ్వస్థామ నిలువుము శకుని;
ఎలమి సందడి బోదు రే కృపాచార్య:
ఇప్పుడు ప్రా పుగా నీనృపాలునకు
జెప్పుండు మన మేమి చేయంగ నొప్పు
పదివేల రక్షించువతి రక్ష నేయ
నిది వేళ యనుటయు నెల్ల సైనికులు
తిరుగ నోపిన గర్ణ తిరుగు; మే మైనం
దిరుగ నోపము పార్డు తెరువు పోలేము,
తనువున నర్జునాన్త్రములు గిక్కిఱిసె;
దొోనలలో వెదకీన. దూపులు లేవు;