పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

ద్విపదభారతము.

రథిక యుగ్మము లొక్కరథముపై నిలిచె;
రథముల రెండేసిరథ్యంబు లయ్యె;
పటుశస్త్రములు వైచి బలిమిఁ బోనాడి
భటు లాలమును బాసి పాఱు చున్నారు;
పోయినకయ్యంబు పోవ ని" మ్మనుచు
వాయు వేగముతోడ వ్రచ్చుచో నపుడు
"వెనుక జిక్కినసేన వెసఁ గూడికొనక
చనుట ధర్మము గాదు చర్చింప మనకు ;
చెన్నారఁ గవ్వడి చేతితూపులకుఁ
గన్నులు గల వెందుఁ గాఁడునో యెఱుఁగ !
కూడి పొం" డనుచును గురుఁడు భీష్ముండు
వీడినసేనకు వెనక నిలిచి
యొయ్యనఁ బోవుచో నొనరఁ బార్థుండు
చయ్యన నెలుఁ గెత్తి జననాధుఁ బిలిచి

సేవతోడం బాఱుదుర్యోధనునితో నర్జునుఁడు కేరడంబు లాడుట.


“నిలుము దుర్యోధన నీయంత రాజు
తొలఁగి పోవునె యిట్లు దురము చాలించి ?
నీవు నీపుత్త్రులు నీసహోదరులు
నీవు మన్నించిననృపులు నీసఖులు