పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

ద్విపదభారతము.

యొసర వాలము చాయ నుచ్చి పోవుటయు
ననయంబు నొప్పిచే సామహాగజము
కులిశంబు దాకినకుంభినీధరము
చలియించి కూలిన చంద మై కూలె.
అతిభీతుఁడై యంత నావికర్ణుండు
ధృతిఁ బాసి తనయున్న తేరుఁ జేయుటయు
సరుఁడు నే ఱొక దొడ్డ నారసంబు నను
గురు రాజు నొప్పించి కురు సేన మీఁద
గణుతింప రాని మార్గణము లేయుటయు
రణము చాలించి కౌరవ రాజు సేన
యేలినవారి సయ్యెడం బాఱ వైచి
"కాలిచప్పుడు దివ్యకటకంబు ముట్ట
రథములు విడిచి పౌరణములు విడిచి
ప్రథసంబు విడిచి గర్వము లుజ్జగించి
కురుభూమికై మేండు గూడి పాఱుటయుఁ
గురురాజుఁ దానును గుట్టు పో విడిచి
సాగథి యపుడు మెచ్చఁగ వేగమునను
దేరు దాఁ దోలుచు ధీరు డై మరలి
గాలి బోవుచు నున్న కాఱాకుపోలె
తేలి పాఱగఁ జూచి తిర మేది దొరలు