పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

283

సులభగాంభీర్య మర్జునపయోరాశి
ప్రళయకాలమునాఁటిభావంబు దాల్చె.
చెల రేఁగి ముందు వచ్చినకృపాచార్యుఁ
డలవోకగా వించె నలుక రెట్టించి
కడువాఁడితూపులఁ గపి కేతనంబు.
తొడిఁబడి యతఁ డిట్లు దోర్బలంబునను
దొనకుఁ జే చాఁచుట తూపు గైకొనుట
ధనువు తోఁ దివియుట తగ నేయుటయును
ఎలమి నింద్రున కైన నెఱుగంగ రాక
బలిమిపోఁడిమిఁ జూపి పార్థు నొప్పింప
లావునఁ జిఱుతకాలమునాఁటిగురువు
భావింప గురుఁ డని పాండవుం డలరి
తూపులఁ గృపుని కేతువుఁ ద్రుంచి వైచి
చాపంబు రథము వక్షము నేయునంత
సురతనూభవు నరిష్టుండును గృపుఁడు
సరవిఁ జిత్రాంశుండుఁ జంద్ర కేతుండు
నరుణవర్ణుఁడు ధీరుఁ డగుసుషేణుండు
మరి మణిమంతుండు మంజుకాశియును
అన నొప్పుపేళ్ల వా రటఁ గూడి తాఁకి
గొనకొని రథరక్షకుల నొంచుటయును