పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

ద్విపదభారతము.

అక్షయంబులు గాన నభివృద్ధి నొందె
నీక్షింప ద్రౌణికి నిషుపంక్తి పొలిసె.

కృపాచార్యునితోడ నర్జునుఁడు యుద్ధంబు సేయుట.


ఆవేళ నెఱిఁగి కృపాచార్యుఁ డెలమిఁ
దా వచ్చి ద్రౌణిముందఱఁ బన్ని నిలిచి
వశముగా దనక వివ్వచ్చుపై నడరి
పసిడియమ్ములు గొన్ని పాఱ వైచుటయుఁ
బీతాంబరంబు గప్పినశౌరి పోలె
నాతఁడు కృపమార్గణావిష్టుఁ డయ్యు
దెరలమిఁ దానును దేవేంద్రసుతునిఁ
దిర మొప్ప నేసెను ధీరుఁ డై ద్రౌణి.
ఇర వొప్ప నర్జునుఁ డిషుపరంపరలు
పరపి కృపాచార్యుఁ బరఁగ నొప్పించె.
మౌర్వినినాదంబు మహితనాదంబుఁ,
బర్వినకోపాగ్ని బడబానలంబు,
నురుతరశరకోటు లూర్మిమాలికలు,
నరుణవీక్షణపుష్పహారవల్లరులుఁ
గలితశోణితవస్త్ర కాండంబురుచులుఁ
గలవీరలక్ష్మియుఁ, గలిగి చూపఱకు