పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

281

సుర లంత నాచార్యసుతుని వీక్షించి
"కురువీరులందు నెక్కుడుశూరుఁ డితఁడు
చక్కు గా దీసవ్యసాచిచాపంబు
చక్క నున్నది వానిసత్యంబుకతన !
చెచ్చెఱ వీరవర్జిత మైనసేనఁ
జొచ్చి జక్కాడునర్జునువిల్లు నేఁడు,
తల మీఱునలద్రోణతనయు సాధించుఁ
జెలఁగుచుఁ దల యెత్తి సిద్ధ మింతయును "
అని నారి ద్రెవ్వినయాక్రీడివిల్లు
వెనుకొని సుర లెల్ల వీక్షించుటయును
ఒక్కింత నగుచు వేఱొకనారి వింట
నెక్కించి మ్రోఁత మిన్నెక్కించి నరుఁడు
నాచార్యసుతునితో నతిఘోరసమర
సూచిత బాణవిస్ఫూర్తి మైఁ బోరి
గసబెస నతనియంగము లుచ్చి పాఱ
ననమునఁ గ్రొవ్వాఁడియము లేయుటయు
లావున లక్షోపలక్ష బాణముల
దేవేంద్రసుతు వైచె ధీరుఁ డై ద్రౌణి.
ఇరువురు నీరీతి నిరుమూడుగడియ
లరుదారఁ బోరుచో నర్జునాస్త్రములు