పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

ద్విపదభారతము.

ఆపార్థుఁ డందఱ కన్ని బాణములు
చాపశింజినియందు సంధించి మించి
పొసఁగఁ దాళీఫలంబులు రాల్చుకరణి
వసుధ డొల్లఁగ నేసె వారిమ స్తములు.
అంతటఁ బోక తా నాగొంతికొడుకు
వింతగాఁ గోపించి వెసఁ గృపాచార్యు
నొప్పించి యరదంబు నుగ్గుగా విఱిచె;
అప్పు డైనను బోక హరులఁ జెండాడి
సారథిఁ దెగటార్చి చాపంబుఁ దునిమి
పూరించె శంఖంబు భూమి గ్రక్కదల.
విరథుఁ డై కృపుఁ డంత విపులకోపమున
నరుణపంకజముల ట్లక్షు లొప్పార
దారుణాకృతి యౌచుఁ దనరారుశక్తి
బోరునఁ గ్రీడిపైఁ బూన్చి యేయుటయు
నది ఘోరభయకారణాకార మగుచు
నది భానుకోటి ప్రభాభాసి యగుచు
నది శూలధర కేళికాభీల మగుచు
నది గౌరవారుణం బగువర్ణ మగుచు
వచ్చుచో నడరి వివ్వచ్చుఁ డాశక్తి
యుచ్చి పో నేసిన నుడుగక యదియు