పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

279

ఆమెయి గురుపుత్త్రుఁ డధికరోషమున
భీమకోపాటోపభీషణుం డగుచు
నా మేటి కెదురుగా నరిగి బాణముల
భూమియు మిన్ను నద్భుతముగాఁ గప్పె.
నరుఁడు వానిని ముంచె నా రాచవృష్టి
గురుపుత్త్రుఁ డంతటఁ గోపంబు పెరుఁగఁ
జక్రాదులను గొంత జళిపించి చూచె
విక్రమంబునఁ గొంత వెఱపించి చూచెఁ
బెలుచ నత్తఱిఁ గొంత బెదరించి చూచె
బలుతూపు లేయుచు భర్జించి చూచె
నతఁ డెంత చూచిన నరదంబులోని
ప్రతిబింబమును బోలిపార్థుండు రథము
నందినగతి నుండు నందంగ రాఁడు
ముందర విహరించు ముట్టంగ రాఁడు.
విజయుఁ డప్పుడు శత్రువిజయంబు నెరపి
భుజములు తల మీఱి పొంగారు చుండ
గురుతనూభవసేన ఘోరాజిలోన
నరికట్టుకొని భీషణాస్త్రంబు లేయఁ
గొందఱ వంచించి కొందఱ నొంచి
కొందఱ విదళించి కొందఱఁ జించి