పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

ద్విపదభారతము

అని పెక్కు భంగుల నగ్గించుటయును
వినువీధిఁ గొలు వున్న వేల్పు లందఱును
“గురుఁడు గాండీవి మార్కొని యింతసేపు
దురములో నిల్చె సంతోషింప వచ్చు!
ధరణి దావాగ్ని ముందర నిల్వ వచ్చు
ధరణి నుగ్రాక్షుముందర నిల్వ వచ్చు
నిలువంగ వచ్చునే నెఱిఁ గ్రీడిముందు !
విలువిద్య మేటివి వెఱవక నిలిచి
తల్లవో కలశజ యల్లవో ద్రోణ
యెల్ల సేనలలోన నీనే శూరుఁడవు !”
అనునంతఁ గౌంతేయుఁ డాచార్యుమీఁదఁ
బనిగొని శరపరంపర బిట్టు పఱపి
సారథి యరదంబు చాపంబు హరులు
ఆరథికుఁడు కేతు వనక యన్నియును
బాణాంబురాశిలోపల ముంచుటయును
ద్రోణుఁ గానక సేన దుఃఖింపఁ దొడఁగె.

అశ్వత్థామ యర్జునుం దాఁకి విజృంభించుట.


ఫల్గునునేపు నశ్వత్థామ చూచి
వి ల్గొని దాఁకె నవ్వీరు మార్కొనుచు.