పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము----ఆ -5

275

గతభీతి నిట్లు దిగ్గజములు రెండు
ప్రతిఘటించినమాడ్కిఁ బార్థుండు గురుఁడు
బవరంబు సేయుచో బాణఘట్టనలఁ
బ్రవిమలబ్రహ్మాండభాండంబు పగిలె
సురగిరి కంపించె సొరిగిరి మునులు
సురరాజు దప్పక చూడ లేఁ డయ్యె.
ఇద్దఱు రణశూరు లిద్దఱు ధీరు
లిద్దఱు నతిరధు లిలఁ బార్థగురులు
చెలువార గురుభక్తి శిష్యమోహములు
తొలఁగించి కోపంబుతోడ నేయుచును
గోలలు దప్పించుకొనునేర్పుతోడ
నాలోన నొవ్వ నేయనివారిఁ బోలె
నున్న చోఁ గురుసేన లోప్పారువేడ్కఁ
బన్ను గాఁ దమలోన భాషించి రిట్లు:
"గురునితో నిట్లు మార్కొని లావు సూప
నరుఁ డోపుఁ గాక యేనరుఁ డోపు నింక.
నలి నెఱ్ఱగఱులు నున్న తిఁ దెల్ల గఱులుఁ
గలుగుబాణంబులు కౌంతేయగురులు
ఏయుచోఁ జూపఱ కేపుమై రవియు
రేయెండయును గూడురీతి యె తోఁచె.