పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

ద్విపద భారతము

కానీనుచందంబుగా నేఁడు ద్రోణు
నేను మార్కొనువాఁడ నీ వేల తలఁక?
పొలుపార మన తేరుఁ బోవ ని" మ్మనుచుఁ
దొలఁగక ద్రోణుపైఁ దోలించి యతఁడు
అక్కజంబుగ మ్రొక్కి యాచార్యుఁ బలికె:
“అక్కటా మీతోడ నని సేయ వలసె!
భీకరాటవిలోనఁ బెద్దకాలంబు
చేకొని తిరిగి వచ్చినయట్టిఫలము
కురుసేన నెల్ల మార్కొన మాకు వల సె.
కర మర్థి మీ రెఱుంగనిపని గాదు
గురువులతోడనా గుటగుట లనక
కరుణింపు మయ్య సంగరము సేయఁగను.

ద్రోణార్జునులద్వంద్వ యుద్ధము.


మున్ను మీ రేయక మొగి నేయ" ననినఁ
బన్నుగా నిరువదిబాణంబు లతఁడు
దొడిగి యేసిన వానిఁ దోడ్తోడఁ గ్రీడి
నడుమ నే తును మాడె నాల్గు బాణముల,
గురుఁడు వెండియు నేసెఁ గోటిబాణములు
నరుఁ డవియును ద్రుంచె నానాస్త్ర తతుల.