పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము----ఆ -5

269

క్రోధించి నేఁడు కై కొన్న లా వేది?
రాధేయు గెల్చితో రాజు గెల్చితివొ?
వనవాస మీ డేర్చి వచ్చినఁ గాని
మన రాజ్యభాగంబు మన కీ రటంచు
నాయాసఁ గాదె మీ రాయాసపడుట!
దాయలు మీ కేడ ధర్మసంచయము !
ఈవల నావల నీవు గావించు
లాపులవలెఁ గాదు లలిఁ గర్ణుచోట !
చూచి పోరాడు నిష్ఠురబుద్ధి" ననుచు
నేచి వాలమ్ము లనేకంబు లే సె.
అతఁడును నేయుచో నయ్యస్త్రసమితి
కుతలంబుఁ బొదివి యర్కుని కాంతి నణఁచె.
అప్పుడు రణభూమి నంధకారంబు
గప్పెను వాయువేగము లేక యుండె.
భానుజుబల మంతఁ బార్థుపైఁ గవిసి
నానావిధంబులు ననిచి రేఁగఁగను
జల మొప్ప మండువేసవిఁ దుంగమడువు
బలిమిఁ జొచ్చినదంతిభాతి నర్జునుఁడు
చతురంగబలముల సమరరంగమున
ధృతిఁ గూల్చి మఱియు రాధేయు నొప్పించి