పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

ద్విపద భారతము

కర్ణార్జును లొండొరులతోడ శూరభాష లాడికొనుట.

కర్ణుఁ దప్పక చూచి కర మొప్పఁ బలికె
"కర్ణ చిక్కితి కాదె గాండివిచేత !
ప్రేలు చుందువు కొన్ని పిట్టబీరములు;
నీలావుపస యెల్ల నేఁడు చూచెదను
అదియును గాక నీయనుజన్ముచావు
పొదివి చూచితి కానఁ బోరాదు నీకు.
ద్రోవదితల పట్టి దుశ్శాసనుండు
వేవురు సూడఁగా వెస నీడ్చునపుడు
విడిపింతు ననిన నవ్వినఫలం బింకఁ
గుడువ కూరక పోవఁ గూడునే నీకు?
తగ వొప్ప నాఁ డేను ధర్మపాశములఁ
దగిలి యుండుటచేసి తప్పి పోయితివి.
నేఁ డెట్లు పోయెదు నీ" వన్న నతఁడు
వేఁడిచూపుల గ్రీడి వీక్షించి పలికె
"కుంతికుమార నీకును బంటు కొలఁది
పంత మింతయుఁ గాక బహుభాష లేల?
నీవు ధర్మజుమీఁద నేరంబు పెట్టి
లావు సేయక నాఁడు లజ్జఁ గోల్పడితి !