పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము----ఆ -5

267

గరుడుండు. ఱెక్కలన్ గప్పుచుం బాముఁ
బొరిగొన్నవడువున భూరిశౌర్యమున
రవిసూనుఁ దాకి దారణకర్మపరత
దివిజేంద్రసుతుఁ డేచి దివ్యాంబకములఁ
గల నెల్ల నిండంగాఁ గడు వేడ్క బఱప
నలకర్ణుడవి యెల్ల నందంద చదివి
నిజపరాక్రమలీల వెరపంగ నెన్ని
విజయుఁ గిట్టెను గోపవేగంబు మెఱయ.
ఆ మహా వీరు లల్లాహవోద్దామ
భీమప్ర్తతాపు లై పేర్చి పోరాడ
సేనాను లపు డాజిచేష్ట చాలించి
పూని చూచుచు నుండి బుద్ధి మార్గమున
గౌంతేయు నొప్పికిఁ గర్ణునొప్పికిని
సంతోష భయ రోష సంయుతు లైరి.
నరుల డంతం గోపించి నారాచ భల్ల
శరశితక్రకచార్థచంద్ర బాణముల
సూతుని నరదంబు జోడుం జాపంబుం
గేతువు హరులు మిక్కిలి నొవ్వ నేసి