పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-5

257


అంత నర్జునుచేత నాభంగీ సేన
యెంతయు గాసిల్లు టెఱిగి రా రాజు
గజపురంబునం బేరు గలవీరవరుల
గజహయా రూఢులుగాం జూచి యేర్చి
పదివేలం బొండని పంపు వెట్టుటయు
(దిద శేంద్రసుతుం దాకి ధీరు బైవారు
కదియుండు పొదువుండు ఖండింపు డేయుం
డదలింపు డను సొంపు లగు మంట లెసగ
నిప్పులు గురియించు నిష్ఠురాస్త్రములు
కప్పిన సంతోష కలితుడై నరుడు
ఉత్తరువై బాణ మొకటి పో నిక
యుత్తమాశ్వంబుల నొకటి పోనీక
క్రక్కునం దన తేరు గడగండ్ల బడక
చెక్కు. చెమర్చక చెలువుమై మెఆసి
తుల లేనియక్షయతూణీరములను
ఎలువడి యొండొంటి వెంటనే నిలుచు
శరములు సంధిచి సైన్యంబు మీద
బరువడి నర్షింప భగ్న మై యదియుం
గరములు నుచ్చి యంగములు నొచ్చియును
శరవహ్నిం జచ్చియు శరణుచొచ్చియును